ముకుంద రామారావు గారి కవిత్వం ‘రాత్రినదిలో ఒంటరిగా’ ఒక గొప్ప అనుభవం. ఆయన శైలి ఆటు పోట్లు లేని నిర్మల జల ప్రయాణంలా వెన్నెల రాత్రి పెద్ద చెరువులో పడవ మీద తెడ్డేసుకొంటూ
విహరించడంలాంటిది. హెచ్చుతగ్గుల్లేని మంద్రమైన తీగవాయిద్యపు కచ్చేరి లాంటిది.
లోగొంతులో సాగే కవిత్వం, ఆలోచనల్ని రేకెత్తిస్తూ అంతర్యాత్రలా నెమ్మదిగా గుండె తడువుతూ ఉంతుంది.
పదాలు పరిచయమైనవే. పదచిత్రాలూ అనుభవమే గొంతు మాత్రం విలక్షణం.నిసర్గమో, మానవ సంబంధమో,ప్రతీ పద్యమూ కథలదండ. ‘కథ అంటే ఏమిటీ అద్భుతమైన కవిత.
ఎందుకో మృత్యువు ఒక జీరగా మట్టిలో కలిసిపోవడం ఒక ఎదురుచూపులా అంతర్లీనంగా ధ్వనించడం నిర్వేదమా?లేక ఒక అన్వేషణా?