పావురాళ్ళకి
పిడికెడు గింజలు జల్లి
గేట్ వే ఆఫ్ ఇండియా ముందు
ఫోటో తీసుకొని
నేనే ‘సలీమ్ అలీ’ అనుకున్నా
ఫ్లాట్ బాల్కనీలో
గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదివి
రెక్కలిచ్చి
మరో మారు
సృష్టికార్యం నెరపి
నిరంతరాయంగా
మూలుగులతో
రెక్కల విదిలింపులతో
రెట్టల ముగ్గులతో
నా జీవితాన్ని
తమ ఆధీనంలో
ఉంచుకున్న
ఈ పావురాళ్ళని
నన్ను విడిచిపెట్టమని
ఎలా అడగాలో తెలియడంలేదు
నవారు బిగించొ
కటకటాల చట్రంతో
కట్టడి చేస్తే
జైల్లో ఉన్నది నేనా
ఎగిరే పావురాలా?