ఒడిలో పిల్లాడు
తాగడం మానేసి
దిక్కులు చూసినప్పుడు
బుగ్గ మీద చిటికేస్తే
బోసినొటితో
నవ్వితే…
ఎవరు చేయి చాచినా
ఉత్సాహంగా అక్కునజేరితే…
దోగాడుతూ
దోగాడుతూ
ఏమార్చి
గుమ్మాలు దాటేస్తే…
చిటిపొటి పాదాలతో
అందినదాన్ని
అందినట్టు
విసిరేస్తే…
అంతా సహజాతి సహజమైన
బాల్య క్రీడే
ఇంటింటి భాగవతమే
ప్రతి శిశువూ
జగన్నాటకసూత్రధారే