చెట్టాపట్టాలేసుకొని
ఇసుక పల్లాలమీద కూర్చొని
క్షిజితరేఖమీద చూపు నిగిడ్చి
కలల తరగలమీద ఊగలేదా?

ఉదయాస్తమానాలు
రజనీకర విభావరులు
సాంద్ర సముద్రతీరమై
తరించలేదా!

ఈ ఇసుక గడియారపు ప్రయాణంలో
ఎప్పుడు వక్రరేఖమీద నిల్చున్నానో
చెప్పగలవా?
నేనే తిరగబడ్డానో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *