’మా పిల్లాడికి
వేదం నేర్పుతారా?’
‘ఒడుగు చేసి అచ్చంగా
నా దగ్గర ఒదిలేయండి
ఓ ఐదేళ్లు ‘
కొన్నాళ్లకి
మరో గురువునడిగింది
భాష నేర్పమని-
దేవభాష
ఆయనా అప్పగించమనే
అమ్మ దృష్టిలో
బతుకు తెరువుకి
బడి తప్పనిసరి
కొన్నేళ్లయ్యేక
బాల్య యౌవనాల
సంధిలో
అక్కున చేర్చుకొని
అనాచితంగా
అవ్యాజ మైన
వాత్సల్యంతో
జ్ఙానాన్వేషణకి
దారి తెలివిడి చేసేక
కవి సందిట చేరిపోలేదా?
జీవితమంతా
మనిషినై ప్రేమ పంచుకోలేదా?