నిక్కరేసుకొని బయటనించి
వస్తూ పలకరిస్తాడు
‘ఉరిశిక్ష పడి చచ్చినవాడికి
సంస్మరణ సభేమిటి
పాకీస్తానీ జేజేలు కాక
దేశద్రోహమే’
‘మీరూ దొంగ వీడియోలు నమ్మేరన్నమాట
రాజద్రోహం దేశద్రోహం ఎలా
అయినా ఇవేం చట్టాలు చెప్పండి
కాలేజి గొడవల్లో వేళ్లు దూర్చడమెందుకూ
వెళ్లిపోయేడు
కాస్సేపట్లో మళ్లి వస్తాడు
ఆవిడ ఉపన్యాసమో
ఆయన చమత్కారమో
వివరించడానికి
మంచి కథో పాత జ్ఞాపకమో
పంచుకోడానికి
నా దుఃఖాలకి సుఖాలకి
సాక్షిగా
నా ఆలోచనలకి
విలోమంగా అతను
నా విరిగిన అద్దంలో
తిరగబడ్డ బొమ్మలా
కాళ్లకడ్డం పడే స్నేహంతో…