నా వేళ్లతో నీ కళ్లు తుడవడం
సులువే
కానీ వేళ్లు కళ్లదాకా
చేరవేయడమే కష్టం

దుఃఖం గుండెకి
పట్టినదయితే తుడవడం ఎలా

సాయంసంధ్యలో ఆమె
నా కోసమొచ్చింది
ఉదయం నించీ ఎదురుచూస్తున్నా

ఈ స్నేహంలో
ముఖం గుర్తుండదు
సాన్నిహిత్యంలో శరీరాలుండవు

బరువెక్కిన పదాలతో
కంపించిన పెదాల వెనక
మాటలు నిశ్శబ్దమే

ఎవరు నువ్వని తెలుసుకొన్నాను కనుక
చటుక్కున దగ్గరకు చేర్చి
ఏం చెప్పగలను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *